సంస్కారం

రచన-:విజయ గోలి

శీర్షిక-: సంస్కారం

నమస్కారానికి ప్రతి నమస్కారమే
ఘనమైన సంస్కారం
మాటలోన మంచితనమె
మల్లెలోని స్వచ్ఛతగ
పరిమళించు బ్రతుకుదారి

జన్మలోని సంస్కారం
జాతివిలువ తెలుపుతుంది
విద్య వలన వికసించును
విజ్ఞానపు సంస్కారం

చిన్న పెద్ద విలువలతో
చిగురించుటే సంస్కారం
మానవత్వపు మంచిమనసు
సేద తీర్చును పరిసరాల

విత్తులోనే సంస్కారం
మొలకలెత్తు ఉన్నతమై
సద్గుణాల సందూకమె
సహజమైన సంస్కారం

దేశ సంస్కృతి రక్షణే
నీ విజయాలకు శిక్షణగా
విశ్వ పటమున నీ ఉనికి తెలుపు
ఇచ్చిపుచ్చు కొనుటలోనె..
విస్తరించు సంస్కారం

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language