శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఆంధ్రప్రదేశ్
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 21/11/2020
అంశం-: కార్తీక మహోత్సవం ప్రద్యుమ్నే శృంఖలాదేవి
ప్రత్యేక నిర్వాహకులు-:కవివర్యులు శ్రీ బి వెంకట్ కవి గారు
శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు గిరీష్ పొట్నూరి గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ -: వచన కవిత
శీర్షిక-: మాతృదేవి
అష్టాదశ పీఠముల
అమ్మ ఒక్క ప్రత్యేకం
శక్తిపీఠ తృతీయం
సతీదేవి ఉదరమిచట
స్వయం ప్రకాశం
ముగ్గురమ్మల మూలశక్తి
విశ్వమునే నియంత్రించు
విశృంఖల స్వయందేవి
శృంఖలగా పూజితం
ప్రద్యుమ్న వాసిని
ప్రమదావని కళ్యాణి
ఋష్యశృంగార్చని
శంభురాణి శివానీ
మాతృబంధ శృంఖలాల
స్వయంబద్ద శృంఖలా దేవి
నిత్యబాలింతగా నడికట్టున
పొత్తిళ్ళన బిడ్డలకు స్తన్యమిచ్చు
మాతృ సౌందర్యమూర్తి
మాతృ మమత దృక్కులతో
భక్తులను పాలించు
కరుణారస రూపిణి
సర్వమంగళ సౌభాగ్య దాయని