రచన -:విజయ గోలి
శూన్యంలో గమనమంటె గమ్యమేదొ తెలియలేదు
బ్రతుకంత పరుగులతో దూరమేదొ తెలియలేదు
అడగకనే అడుగుపెట్టి అలజడులే నింపావుగ
నవ్వుచాటు వ్యధలోన నటనేదో తెలియలేదు
కనులుమూసి కలలదారి కమ్మదనం చూపావుగ
మాటలలో మధువుతప్ప.విషమేదో తెలియలేదు
కరకుతనం కధఏమిటొ కాలానిదె నిర్ణయముగ
మూసుకున్న తలుపువెనుక తలపేదో తెలియలేదు
చెంతలేని మనసుపైన చింతలతో పోరాటం
చుట్టుకున్న మమతలతో *విజయమేదొ తెలియలేదు