గజల్ విజయ గోలి
శిఖరమై శిరసొంచక నింగి దారి నిలిచిపో
నీ అడుగు జాడొక్కటి నేలపైన విడిచిపో
ఒంటరిదె అడుగైతే గమ్యమెపుడు గగనమే
సహనమే సాంగత్యం.. జనహితమై సాగిపో
నిన్నెపుడు నీడగాను తలచుకుంటు మలుచుకో
పదుగురికి పంచుకుంటు తరువుగానె పెరిగిపో
పుట్టుకతొ ఏడుపులే పుచ్చుకునీ వచ్చావు
నవ్వులే నీబాటన జల్లుకుంటు నడిచిపో
ఓర్వని నిప్పుకణం రగులుతుంది జ్వాలగా
శిలపైన శాసనంగ నీ విజయం చెక్కిపో