శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి. 1/11/2020
అంశం-:హృదయ స్పందనలు. శిరసావహించు శిఖరమై ఎదుగు
నిర్వహణ-:శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ -వచన కవిత
శీర్షిక-:శిఖరం
శిరస్సువంచి శిరసావహించు
శిరోధార్యమైన మాట..
ఎదుగు లోన ఒదిగి చూడు
ఎదుట నిలుచు ఎనలేని గౌరవం
విజయాలతో నిను నిలుపు
ఎదురులేని శిఖరాన
అమ్మపాల సంస్కారం
అడుగడుగున ఎదురొచ్చే
మనిషిలోని మంచితనం
మక్కువగా పంచుకుంటె
మనుగడే మల్లెపూలబాట
మహాత్ములే మలిచినారు
మంచిమంచి మాటలెన్నో
మంత్రమైన మాటలతో
మలుపులనే తెలుసుకుంటు
గెలుపులతో ఎదిగితే
ఒదుగుతుంది గిరిశిఖరం
శిరస్సు వంచి నీదరిని.