వైష్ణవీ దేవి

శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం. ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 9/12/2020
అంశం -: కార్తీక మహోత్సవం. జ్వాలాయాం వైష్ణవీ దేవి
నిర్వహణ -: పురాణ కవి వర్యులు శ్రీ బి వెంకట్ కవి గారు
పూజ్యులు శ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ -: వచన కవిత

 

సతీదేవి ఖండిత అంగములు
అవని ఆపదల గాచేటి అంబగా
అష్టాదశ శక్తి పీఠాలుగ వెలసిన
జగన్మాత సందర్శనా భాగ్యమే
సకల పాపహరము
సర్వైశ్వర్య దాయకము.

అత్యుత్తమ శక్తి పీఠము
మహిమ గల మాతగా
పంచాదశ పీఠమున
పరమ పావని జిహ్వ
లోకైక దీపాంకురమై
అనంత జ్వాలా ప్రజ్వల
పరమేశ్వరి జ్వాలాముఖి దర్శనం

హిమవన్నగ శ్రేణులు
హరదేవుని కైలాసం
స్వామి ఆవాస పరిసరాలలో
కాంఘ్రా పర్వత శిఖరము పై
జ్ఞాన వైరాగ్య దాయనిగా
వైష్ణవీ దేవి విరాజితం

నవదుర్గల ఆలయం
నవజ్యోతుల దర్శనం
నయనానందకరం
భక్తిముక్తి దాయకం

మొఘలుల మొదలు
అన్యమత రాజులంతా
అమ్మ సేవలు చేసి
అజేయు లైనారు.
అడిగిన వారికి లేదనక
వైభోగములిచ్చు వైష్ణవీ మాత

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language