aవేణుగానం విజయ గోలి
రేయిపగలు సంగమించిన
అందమేకద సందెపొద్దు
నింగిమెరిసే చుక్కదీపం
వెలుగులేగద చిన్నిఆశలు
మనసులోని తపనలేవొ
మోముపైన మెరుపులగును
నీలి కురుల అగరుపొగల
తెమ్మెరేగద తీపి ధ్యాసలు
కోయిలమ్మ కూతలేగ
వలపు స్వాగత గీతాలు
ఛైత్రమాసపు వన్నెలేగా
మనసు నింపిన చిత్రాలు
తెల్ల మబ్బుల తెరల దాగిన
వెండిజాబిలి దోబూచులేగ
చూపుకలిపి మదిని దోచే
మరుని విరి తూపులు
మనసుగెలిచిన మౌనం
మాటలాడితే గానం
మరల మరల కోరుకుంటే
వెల్లువయ్యే వేణుగానం