శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
వెన్నెల మడుగున విచ్చిన కలువల సొగసుల సందడి
తారల నడుమన చిక్కిన జాబిలి తలపుల సందడి
అల్లరి గాలులు వేసే ఈలల మోహన మురళీ
కొండలు కోనలు ఓ యని పలికే పిలుపుల సందడి
గువ్వల రాగం గుస గుస పాటల వేడుక తోడుగ
పువ్వుల బాణం రివ్వున(గుచ్చిన) తాకిన వలపుల సందడి
అష్టమి చంద్రుని వడి వడి అడుగులు పున్నమి గుమ్మం
తరువుల నీడల మిణుగురు గుంపుల మెరుపుల సందడి
నింగిన కాంతులు ఎపుడూ నేలను మీటే తంత్రులు
సృష్టి సరాగం విధాత విజయపు నగవుల సందడి