శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
వెన్నెల పూవుల జల్లును నేనే
వేకువ వెలుగుల ముగ్గును నేనే
ఆమని పాటల రాగం నీవా
మధుపము కోరే మధువును నేనే
మురళీ మువ్వల సవ్వడి నీదా…
ముదితల అలకల ముంపును నేనే
మధువని ఏలిన రాజువు నీవూ..
మదనుడు వదిలిన శరమును నేనే
సాగర సంగమ అందం నీవే
నదినై నెగ్గిన విజయము నేనే !