గజల్ విజయ గోలి
వెదురుపుల్ల రాగాలే వినిపించెను మధురముగా
నినుతాకిన ఆనందం నినదించెను మధురముగా
పెదవులపై నీనామమె పల్లవించు ప్రణవముగా
విశ్వమంత నీరూపమె అగుపించెను మధురముగా
పరవశాల ప్రతిధ్వని పరిమళించు ప్రణయముగ
నీపదముల పొగడలుగా వికసించెను మధురముగా
తీయనైన మమతలనే మాయతెరల దాచేవుగ
కరిగిపోవు నవనీతమె వివరించెను మధురముగా
దరిజేరిన దారిచూపు విజయానికి సారధివై
గమ్యాలను గీతలోన చూపించెను మధురముగా