గమ్యం చేరువయిందని…
తెలిసిన మనిషి మనోవేదన
*వీడ్కోలు*విజయ గోలి
కాలమా ఆగిపో నీజతలో నడువలేను..
ప్రాణమా నిలచిపో నీతోడుగ సాగలేను
గమ్యానికి చేరువయిన బాటసారిని
గతజన్మల గురుతులింక చేరలేవని
కమ్ముకున్న కరిమబ్బులు కురిసేలోగ
కంటిలోని చిరువెలుగులు ఆరేలోగ
మమతల దీపాలనే వెలిగించమంటున్నా
కడలిలాగ బంధాలను కలిపి వుంచమంటున్నా
గతకాలపు దోషాలను విస్మరించ మంటున్నా ..
కడసారిగ వీడ్కోలు విస్తరించి చెపుతున్నా..
కాలమా ఆగిపో నీజతలో నడువలేను..
ప్రాణమా నిలచిపో నీతోడుగ సాగలేను.