చిత్ర వన్నెలు ఛత్రమవగా ఛైత్రమాసపు సోయగాలు
గజల్ విజయ గోలి
నవ ఉగాది పద లాస్యాలు వసంత వర్ణ సౌరభాలు
చిగురు పాపల చిన్ని నవ్వుల చిలిపి తెమ్మెర సంబరాలు
కొత్త కోర్కెల తోరణాలతొ కోరి పలికెను స్వాగతాలు
కొండ కోనల కుహూ మంటూ కోయిలమ్మల కొత్త రాగం
వేప పువ్వులు వెండి గిన్నెల మధువు నింపిన సంతసాలు
గున్నమావి గుత్తులన్నీ కొత్త కళలతొ మత్తు నింపగ
మరుల బాణం ఎదను నాటగ వలపు చిచ్చున మానసాలు
విశ్వమంతా సిరుల పంటగ “విశ్వావసు “విజయగీతం
ఆరు రుచుల వాయులీనం ఆలపించును మోహనాలు