గజల్ సాహిత్యవేదిక
గజల్ తరంగ్ గజళ్ల రచన పోటీ
రెండవ విభాగము , కొత్త కలాలు
విజయ గోలి. 9704078022
విశ్వమంత తరచిచూడ వింతలతో వేడుకలే
పొత్తులేని పోకడలలొ విలువలతో వేడుకలే
ఋతువులారు ప్రకృతి ఒకటె అనుభవాలు వేరువేరు
సారమేదొ తెలుసుకుంటె భవితలలో వేడుకలే
కలిమిలేమి కలకాలపు బంధువులే కాచుకుంటె
కనులనీరు దాచుకుంటె నటనలలో వేడుకలే
కాలమిచ్చు తీర్పులలో కలతమాసి పోవునులే
మరుపన్నది మాత్రలుగా మలుపులలో వేడుకలే
కమ్ముకున కరిమబ్బుకు తెలియదుగా ఉనికెక్కడొ
ఉప్పుతోటి ఉసిరుకున్న బంధాలలొ వేడుకలే
నిన్ననాది రేపునీది ఆశలతో పోరాటం
మరునిమిషం తెలియలేని మనుగడలో వేడుకలే
ఆకాశం కప్పుకున్న అవనిదెపుడు విజయమేగ
అంతిమంగ మనిషి బ్రతుకు మాయలలో వేడుకలే