స్నేహాభినందనలతో.. అంటూ
ఎంతో ఆత్మీయంగా
గౌరవనీయులు ‘శ్రీమతి విజయ గోలి ‘మేడమ్ గారు
పంపిన గజల్ సంపుటిలు
చిత్రవీణ
పిల్లనగ్రోవి అందుకున్నాను
📌 చిత్రవీణ
తన మనసు బంధాలు , ఆనందాలకు అంకితమిచ్చిన
ఈ పుస్తకంలో ‘ 56 ‘ గజళ్ళు ఉన్నాయి
ప్రతి రచన వెన్నెల ముత్యం
జీవిత సౌకుమార్యం
అన్ని భావ వర్ణాలను అద్దుకున్న ఈ గజళ్ళు
చదువుతున్నంత సేపూ
ప్రపంచాన్ని మరచిపోతాం
12 వ గజల్
‘ పరుగెందుకె జీవితమా ‘
” ముందు నడువు జీవితమా నిన్ను దాటి పోలేనులే
హక్కులున్న హృదయంతో మాటలేవో మిగిలాయిలే ”
36 వ గజల్
‘ కన్నులార చూడలేదు’
“తరలివచ్చు బాటసారి తలపులేదు తారలకే
గాలివాలు కబురైనా ఆనవాలు చూపదాయే”
ఎెంతో నచ్చాయి
📌 పిల్లనగ్రోవి
రాధామాధవస్వామి చరణారవిందములకు
భక్తితో సమర్పించిన ఈ సంపుటిలో
’50 ‘ గజళ్ళు ఉన్నాయి
ప్రతి గజల్ అపురూపమైన రాధామాధవీయమే
20 వ గజల్
‘ కనులు మూసి తలచితివా ‘
గుండెలలో గుడి ఉన్నది దేవేరివి నీవేగా
నీ మనసున నిత్యమైన అర్చనలో నేనుంటా!
అష్టవిధనాయికలలోని మొదటి గజల్
స్వాధీన పతిక
“కురులుదువ్వి విరులు ముడుచి కునుకులనే కాజేయును
పాదములా పారాణుల సొగసు నింపు నిన్ను జేరి ”
ఆకట్టుకున్న రచనలు
సాహిత్యరంగంలో అత్యంత ఆత్మీయత కనపరిచే రచయితల్లో విజయ మేడమ్ గారు ఒకరు
వారి రచనలు జీవితాన్ని
జీవితపు అనుభూతులను
చాలా లోతైన వాక్యపు విశ్లేషణలుగా ఆవిష్కరించగలవు
ఆ రచనలు
పూల పుప్పొడులుగా
మనుష్యుల తత్వాలుగా
కారుణ్య హృదయాలుగా
పచ్చని చెట్ల వసంతాలుగా
ఆకురాలు శిశిరాలుగా
పాఠకుల మనసును కట్టిపడేస్తాయి
మనుష్యులను గుర్తుపెట్టుకోని
ఆప్యాయతను పంచడమే
మానవీయత
మానవీయ రచయిత్రి, కవియిత్రి
విజయ మేడమ్ రచనా ప్రయాణం
దిగ్విజయంగా కొనసాగాలని
హృదయపూర్వకముగా అభిలషిస్తూ
ఈ పుస్తక మణిముత్యాలను పంపినందుకు
వారికి
మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను