గజల్ . విజయ గోలి.
పువ్వులుగా నవ్వులుగా వెలిసినదే సంబరంగ
ముంగిటలో రంగవల్లి విరిసినదే సంబరంగ
నట్టింటను పండగగా ఊయలలో శ్రీలక్ష్మిగ
పుట్టింటను భాగ్యముగ వెలిగినదే సంబరంగ
కనకంతో తులతూచీ కన్యకగా దానమీయ
మగనితోడ మెట్టింటను నిలచినదే సంబరంగ
కూతురుగా కోడలిగా ఆలిగాను అమ్మగాను
లాలనలోపాలనలో నవ్వినదే సంబరంగ
మింటనెగిరె సాధికార సమర విజయ కేతనముగ
అంబరాల హద్దుదాటి గెలిచినదే సంబరంగ