వాలు పొద్దున రాలు ఆకులు


రచన-:విజయ గోలి.
శీర్షిక-:వాలుపొద్దున రాలు ఆకులు

రాలిపోవు ఆకులంటె అలుసుఏల
వాలుప్రొద్దు బ్రతుకులపై నిరసనేల
ముదిమి ముడతలు పడుగుపేకల ఆనవాళ్ళే
బ్రతుకు నేసి అలసిపోయిన నేతగాళ్ళే

సృష్టి క్రమమున సాగిపోయే..
నిరంతర ప్రవాహమే వయసు
నేడునేను రేపునీవు పయనమేగ
అలసిపోయిన మనసు
కోరును ఆదరణలే..అన్నమంటూ

అలసి సొలసిన అమ్మానాన్నకు
అన్నీ నీవుగ ఆదరించు
వాడి వుడిగిన వేళనీవు
ఊతకర్రగా చేయినివ్వు.
నవ్వుతూనే సాగనంపే
సమయమివ్వు..

ముసలి అంటూ రోసిపోక
చేతిమీద చేయివేసి
గుండె గుప్పెడు కరగనీయి
జీవముడిగిన కళ్ళలో
జ్యోతి వెలుగును చూడు

ఆదారి నిండిన నవ్వులే
నీఇంట నిలుచును దివ్వెలై
ఆవెలుగు నిలిపిన రవ్వలే …
నిండు దీవనలై…..నీవెంట నడుచు..

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language