వస్తావనే ..

శుభోదయం🙏🏻🙏🏻🙏🏻

గజల్.          . విజయ గోలి

వస్తావనే ఒకరోజున ఆశలుగా  అనలేనులె
వస్తాననే నీబాసను ఊహలుగా  అనలేనులె

మనసెంతో హాయిగుంది.ఆవలపుల బాటలోన
ఆతలపుల నిలుచుటనగ పిలుపులుగా అనలేనులె

నిలవనంది నామనసే నినుచూసిన నాటినుండి
చెప్పుకోను బంధమని  గాఢముగా అనలేనులె

శవమునేను జీవముతో  యోచనలో ఏమున్నది
పరాయివనె అనుకోనులె సొంతముగా అనలేనులె

కూలివున్న శిథిలాలపై సౌధమెలా కట్టగలను
నీవులేక బ్రతకటమే విజయముగా  అనలేనులె

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language