శుభోదయం 🌹🌹🌹🌹🌹
సహజంగా శరీరానికి చల్లటి గాలి తగలగానే మనసు…. ఆనందంగా…
మాట అప్రయత్నంగా *అబ్బ…గాలి ఎంత బాగుందో అనేస్తాము…
ఆస్వాదిస్తూ…ఆ గాలి అందాల వనంలో ఎలా…అలరిస్తుందో….
వ్రాయాలని చిన్న ప్రయత్నం…….💐💐💐💐🌻🌻🌻🌻🌹🌹🦜🦜🦜
*వలపుగాలి. విజయ గోలి
కొండతాకి ఎదురొచ్చిన
కోయిలమ్మ రాగాలు
కోటి కోటి స్వరాలుగ
కోనంతా నింపుతుంది
కులుకులతో కొండగాలి
గున్నమావి గూటిలోని
గువ్వల గుసగుసలే పల్లవిగ
చిరునవ్వుల చరణాలు
చిగురాకుల తోరణాల
ఊయలూగు చిరుగాలి
విరబూసిన విరులపైన
మరులుగొనే మధుపాలతో
ఝమ్మన్న నాదాలకు
మయూరాల నర్తనల
తాళమేయు తరువు గాలి
చిట్టి పొట్టి చిలకమ్మల
పంచదార పలుకులనె
పంచుతుంది వనమంతా
పూ వల్లరులే మీటుతుంది
అల్లరిగా ఆటలతో పిల్ల గాలి
రాలుతున్న పూవులతో
దోబూచుల దొంగాటలు
ఆటవిడుపు అందాలుగ
అలల సాగు పాటలుగ
చెలరేగు చిలిపి గాలి
వనమంతా వలపుగాలి
I