వయసు * విజయ గోలి
కదిలిపోయె వయసునే
ఆగమంటు అడిగాను
ఆగలేను రమ్మంటూ
నవ్వేస్తూ నడిచింది
నీబాటలొ నడిచినేను
ఓడినాను ఎన్నిటినో
బాల్యాన్నే బ్రతుకులో
వదిలినాను మొదటిగా
కౌమారపు కలలెన్నో
కంటూనే జారినాను
నడిమివయసు నటనలొ
నాదికాని బ్రతుకులో
ఏమున్నది ఈలోకం
స్వార్ధానికి అర్ధాలుగ
వృద్ధ్యాప్యపు వ్యర్థాలు గ
దేనికొరకు పరుగులు
చెప్పమంటు వయసునే
అడిగాను ఆర్తితోను
వయసు నవ్వి చెప్పింది
కదులుతున్న బాటలోని
బాటసారినే నేను
గమ్యముంది నాకు
గుండెతీపి గురుతుగ కొందరికి
కంటి నీటి చెమ్మగా కొందరికి
మిగిలిపోతాఅన్నది అడుగు
ముందుకేస్తూనే వడివడిగ