వనదుర్గ

శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం. ఏడుపాయల

సప్తవర్ణాల సింగిడి  16/10/2020

అంశం-:ఐచ్ఛికం.  ఏడుపాయల వనదుర్గ

నిర్వహణ-:శ్రీమతి గాయత్రి గారు శ్రీమతి హరిరమణగారు

                శ్రీమతి కవిత గారు

రచన-: విజయ గోలి

శీర్షిక-: ఆది పెద్దమ్మ

ప్రక్రియ-: వచన కవిత

ఏడుపాయల వెలసిన వనదుర్గ

నవరాత్రి శోభల నడయాడు నవదుర్గ

నడిచినంత మేర పావన మంజీరమే

గరుడగంగగ నిరతము నీ పాదాభిషేకమే

మంజీర తరగలపై మల్లెపూవల్లె

ఏడుపాయలపైన ఎర్రగన్నేరల్లె

బంగారు బతుకమ్మవై బంతిపూవల్లె

ఇంతులకాచేటి పూబంతివే తల్లి

రంగురంగుల పూల సింగిడులపైన

మహరాణివే  తల్లి మమ్మేలవమ్మా

సంబరాల సద్దిబతుకమ్మలెత్తేరు

పసిడిపంటల పసుపుభాగ్యాలనిమ్మా

ఏడుపాయల దుర్గవైన బెజవాడ కనక దుర్గవైన

కలకత్త మహంకాళి వైన కంచి కామాక్షి వైన

అమ్మలకు అమ్మవు ఆది పెద్దమ్మవు

ముగ్గురమ్మల రూపు మూలపుటమ్మవు

పూవుకొక్క రీతిగా పూజలే చేసేము

కలగన్న కోరికల వరములే అడిగేము

నవ విధంబుల నవరాత్రి పూజలే చేసేము

బసచేసి మాఇంట భాగ్యాలనిమ్మా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language