శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం
ఏడుపాయల. సప్తవర్ణాల సింగిడి
అంశం-:వంగపండు మళ్ళీ వస్తవా 5/8/2020
నిర్వహణ-:శ్రీ వెలిదె ప్రసాద్ శర్మ గారు
రచన-:విజయ గోలి
శీర్షిక-:అరుణారుణ వందనాలు
విప్లవవీరుడా వందనాలు
అరుణారుణ వందనాలు
జానపదాలకు జతులు ..
నేర్పి జనపదాలను జాగృతించిన
వీరుడా. ..విప్లవ వందనాలు
ప్రజా నాట్యమండలికి ఆయువై
అలయక తిరిగావు …
వీధి వేదికగా గజ్జె కట్టి..
ఏం పిల్లడో వెల్దమొస్తవా…అంటూ
చెవుల పిల్లులతో ..శంఖువూదించి
పాముల కుట్టే చీమలున్నాయని..
నీ గళములోన తూటాలు పేల్చినావు
జజ్జనకా జనారే …పదము కదుపుతూ
రైతన్నల కూలన్నల నేతన్నల..
కష్టాలను కట్టకట్టి ..పాటల ఈటెలనే
సంధించినావు సర్కారుకు..
నీ గళమెత్తిన ప్రజా దళమైనది
ఆంధ్రావని..ఇక అనాధ.
ఉత్తేజించే నీ స్వరము లేక…
మళ్ళీ రమ్మని మరీ మరీ వేడుతున్నాము…
నీ పాటలే..మాకు చైతన్యపు బాటలు..
నీ గళమే మేలుకొలుపు నినాదం
నీ ఉనికే…అజరామరము…
వీడుకోలు ఇక విప్లవ వీరుడా🙏🏻🙏🏻😢🌹🌹🌹