శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
రేయంతా నీకన్నుల ఒక కలగా దాచేయవ
కను పాపల సౌధంలో బందీగా దాచేయవ
నీ తలపే చెక్కిలిపై అరుణిమలే అద్ది పోయే
నీ శ్వాసల గుసగుసలో నను లయగా చేసేయవ
ప్రకృతిలో దాగున్నది వేదంగా ప్రణయ గీత
నువు చేసే యాగంలో మంత్రంగా మార్చేయవ
పూ రెమ్మల సందిటిలో పులకించే తుమ్మెదలే
నీ నవ్వుల విజయంలో ( సవ్వడిలో )నను మువ్వగ మలిచేయవ
నీలిమబ్బు తునకలలో నింగి నేల బంధముంది
హరితాలను కట్టుకున్న వల్లరిగా చుట్టేయవ!!