విజయ గోలి .14 /5/2019. రెక్కలు
ఆరోహణ
అవరోహణ
ఆలాపనకు
తప్పని సరి
సాగర సంగమంలో ..
అలల సంగ్రామం లాVijaya goli
రెక్కలు
అమ్మగా
అత్తగా
కూతురిగా
కోడలిగా
అనేక రూపాల అతివ ..
రూపానికొక గుణం ..Vijaya goli
రెక్కలు
కంచికి
చేరని
కధలు
బాగుంటాయి
ఎపుడు వర్తమానం లోనే
ఉంటాయి..Vijaya goli
రెక్కలు
మనసుకు
రెక్కలు
వచ్చినై
గమ్యం లేదు
గాలివాటు మనసుకు
గమ్యమేమిటి ..Vijaya goli
మిత్రులకు శుభోదయం
రెక్కలు
మౌనమే
మంచిదని
అనుకున్నా
ప్రతిసారి
తిరుగుబాటు వాదాన్ని
నేర్పింది మౌనం ..Vijaya goli