మల్లునాధ సూరి కళాపీఠం
శ్రీ రాజ రాజేశ్వరి విజయ గోలి
శ్రీ రాజరాజేశ్వరి శివ పరమేశ్వరి
ఇష్ట కామేశ్వరి. ..శ్రీ మహేశ్వరి
ముగ్గురమ్మల మూలరూపిణి
ముల్లోక జననివి ముగ్ధ రూపిణి
దుష్ట రాక్షస సంహారిణి
శిష్ట హృదయ సంచారిణి
సత్య స్వరూపిణి శార్వాణి
విద్యారూపిణి శ్రీవాణి
ఛిద్రూపినీ లావణ్య దరహాసిని
పంచభూతమల చైతన్యరూపిణి
పరమశివుని పట్టపు రాణి
సప్తమాతల శక్తివి నీవె కళ్యాణి
ఉమాసుందరి త్రినయని
అష్టైశ్వర్యాల మాతవు నీవు
సృష్టి రూపిణి శ్రీ లలితా
వేదమాతవు గాయత్రి
వేడుకుందుము నిను శ్రీమాత
మా ఇడుముల బాపి శాంభవీ
వరముల నొసగుమ శ్రీ రాజరాజేశ్వరి
ఛిద్రూప సౌందర్యినీ శ్రీరాజ రాజేశ్వరీ