రాజకీయం రగులుతుంది
రావణుడి కాష్ఠంగా
విశ్వమంత ఒకే తీరు
పోగాలం పొంచినది
రాముడేమి చేసాడు
ధర్మమేగ చెప్పాడు
దేవుడిదే తల నరుకుట
దేశపు దౌర్భాగ్యమేగ
దగుల్బాజి జనులార
దైన్యం వీడరేమి
గుడిలోకి చొరపడితే
గజనీగ చరిత్రలో
దిగజారుడే నీబ్రతుకు
దిద్దుకోను ఆశుండదు
తప్పుడుదారిలోన
తరాలేవి మిగలలేదు
ఒక్కనాటి మెతుకు కొరకు
అమ్మపోకు అమ్మపాలు