రహదారుల కరినాగుల పుట్టలుంటె చీకటేగ
చిరుమొగ్గలు చిగురులోనె రాలుతుంటె చీకటేగ
నిశీధిలో నీడలెలా తోడువచ్చు కడదాకా
చేనుకొరకు కంచెలతో లంకెలుంటె చీకటేగ
చిట్టడవిలొ చిరుకూతలు హెచ్చరికే నడిరాతిరి
అదునెరగక పొదలమాటు పరుగులుంటె చీకటేగ
ఆకలెపుడు అంచనాకు అలవికాని ఆపదలే
కడుపుమంట కారుచిచ్చై కాలుతుంటె చీకటేగ
గుండెకోత గుర్తులతో అడుగులలో“ విజయ”మెలా
మనుషులలో మదమెక్కిన మృగాలుంటె చీకటేగ