*అంధకారం* గజల్ విజయ గోలి
రంగురంగు లోకాన్నే చూడాలని నాకున్నది
హంగులోని పొంగేమిటొ తెలియాలని నాకున్నది
విరపూసిన పూవుకైన ఎరుకేనా వర్ణమేదొ
పరిమళపు రంగేదని అడగాలని నాకున్నది
అమ్మగొంతు లాలనలో చూపేమిటొ తెలిసింది
శబ్ధానికి రూపుంటే తడమాలని నాకున్నది
హరివిల్లులో విరిసినదే శ్వేతంగా ఏకమైతె
కంటిలోని నలుపుజాడ వదలాలని నాకున్నది
మనసుకన్ను విప్పుకుంటె వి జయముంది
అంధకారమె లేదంటూ అరవాలని నాకున్నది