శీర్షిక ..రంగుల తిరోగమనం ..విజయ గోలి
తిరోగమించిన రంగులన్నీ ..
కరుడు కట్టిన కాఠిన్యము లా..
ఎగిసిపడుతున్న భావాల లావాను ..
గుండె గొంతు కలంలో నింపేస్తూ …..
రుధిరక్షరాలను ..వెదజల్లుతూ ..
ఎడతెగని చైతన్యాన్ని ..ఎదల నింపే యత్నం లో
వైకుంఠపాళి లో విరుగుతున్న …
నెత్తుటి పాళీలు.. విజయ గోలి
విచ్చల విడిగా కేరింతలు కొడుతూ …
రంగు రంగుల సీతాకోకలై …
నింగినంటుతున్న ..ఆశలు..l
ఆశకొక ..రంగై…రంగు రంగుల పూవులై ..
పరిమళిస్తున్న… రమణీయ ఊహలు ..
ఆనందపు రంగులన్నీ…భావాల మధుపాలై …
మది కలంలోకి… మధురసాలు …నింపుతున్నాయి ..
భావనలను అందమైన శిల్పాలు గ మలచమంటూ.. ..
విజయ గోలి