యువరాణి. విజయ గోలి
ప్రతి ఇంటి సిరుల పంట
అమ్మ నాన్నల వలపు పంట
తోడపుట్టిన వారికి బంగారు పంట
చిన్నారి తప్పటడుగులు ..
నాన్న గుండెల చప్పుడు ..
అమ్మాయి అలక
నాన్న కన్నుల నలక
యువరాణి మాటలే ..
నాన్నకు రతనాల మూటలు
మురిపెముగా అమ్మాయి నవ్వితే ..
నాన్న ఎదలోన ముత్యాల జల్లులు ..
పెరిగి అమ్మాయి పేరు తెచ్చిన రోజు …
నాన్న కన్నుల వెలుగు వేవేల దీపాలు
అమ్మాయి నాన్నల బంధము
జన్మ జన్మలకు కోరేటి అనుబంధముVijaya Goli