##########మదిలో వ్రాసుకున్న మౌన గీతాలను …
మననం చేసుకుంటున్న సమయంలో ..
దాచి ఉంచిన ఘడియలన్ని గడియ తీసి …
గుండెగది దాటి ఎదురు గా నిలబడి ..
గురుతున్నానా అంటూ గుంభనంగా నవ్వుతుంటే…
మలి పొద్దులో తొలిపొద్దు కిరణం మెరిసినట్లు ..
ఎదలో ధ్వనిస్తున్న జ్ఞాపకాల సవ్వడి ..
తొలకరి స్మృతుల జల్లుల్లో …వలపు మబ్బుల దాగిన వర్ణాలు…
హరివిల్లులో.. చిత్రాన్నే.. కనులముందు నిలిపాయి …
కరిగిపోయిన కాలంలో కరుగని.. జ్ఞాపకాలు …విజయ గోలి