మౌనం మాట్లాడుతుంది

శుభోదయం 🌹🌹🌹🌹🌹

కాజా శ్రీనివాస్ గారి “మౌనం మాట్లాడుతుంది “ కవితా సంపుటి పై నా చిరు సమీక్ష .

ఆత్మీయ స్పందన “
“మౌనం మాట్లాడుతుంది “

శ్రీ రాజ్ కృష్ణ రేపల్లె వారితో నా పరిచయం చాలా తక్కువ .నిజానికి అసలు లేదనే చెప్పాలి . నవ్యాంధ్ర రచయితల సంఘం నిర్వహిస్తున్న కవి సమ్మేళనంలో కలిసాము . వారు తమ పుస్తకం “మౌనం మాట్లాడుతుంది “ ఇచ్చారు .తెలుగు ,హిందీ,ఇంగ్లీషు లో వారు వ్రాసిన కవితలు చదివాను .మూడు భాషలపైన మంచి పట్టు తో వ్రాసారు . హిందీ ఉపాధ్యాయుడు కాబట్టి హిందీలో కూడా ఎంతో సరళంగా కవనం చేసారు .
నిజానికి మౌనం మాట్లాడటం అంటే రాజ్ కృష్ణ గారి కవితల లోనే చూస్తాం .
అక్షరాలలో అంతర్గతంగా దాగివున్న మనసు చెమ్మ ప్రతి హృదయాన్ని తాకుతుంది . మండలి బుధ్ధ ప్రసాద్ గారు , రాజ్ కృష్ణ గారి సహ ఉపాధ్యాయులు ముందు మాటలు వ్రాసారు . వారి మాటలలో అతిశయోక్తి అసలు లేదు .ఈ సంపుటిలో మొత్తం 41 కవితలున్నాయి .ఎవరి శైలికి అనుకరణ లేని ప్రత్యేక శైలి లో ఆవిష్కరించారు .
మొదటి కవిత గా అక్షరాన్ని అక్షరీకరించారు.
అక్షరం లో ఆర్ద్రత వుంటే అమ్మ లాలన , ఆవేశం వుంటే అగ్ని కణం అంటారు
నిజమే అక్షరం లో చైతన్యం లేకపోతే భావాలకు కవిత్వంగా ఆవిష్కరణ జరగదు . కవనం ఏదైనా మనో స్పందన ,ఆ స్పందనలో జీవం వుండాలి .అపుడే ఆ కవిత్వం కాలంతో పాటుగా సాగుతుంది .
మౌనం మాట్లాడిన మాటలన్నీ జీవత్వం నింపుకున్నాయి .
మౌనం అన్న కవితలో ..మౌనం మాటలు మన మనసుకు వినపడేంత చక్కగా వ్రాసారు .నాన్న కవితలో …నాన్న కఠినత వెనుక దాగున్న కమ్మని మనసును మాట్లాడించారు .బ్రతుకు బండి , అడ్రస్ ..ఎక్కడా, ఇలా చాలా కవితల్లో సమాజ స్థితి గతులను జవాబు లేని ప్రశ్నలుగా ..మౌనంగా ఎత్తి చూపుతారు .
స్త్రీ కవితలో …అమ్మ తనానికి అపార గౌరవాన్ని ఇస్తూ వారి వ్యక్తిత్వాన్ని చాటుకుంటారు .
Ray …of ..Hope
కరోనా సమయం లో ప్రపంచమంతటా లాక్డౌన్ లో ప్రతి ఒక్కరి కళ్ళలో మనసుల్లో పేరుకున్న భయానికి చీకటి మేఘాల మధ్య
మెరిసే చిన్న మెరుపు ఆశైతే .ప్రకృతిలో మనిషి ఉనికి సమాధి పై విచ్చుకున్న గులాబీలు అంటారు . అలాగే you The Teacher పోయమ్ ,Dream ప్రపంచ శాంతిని కోరుకుంటారు .
వ్రాసిన ప్రతి కవిత మౌనం వీడి మనసుతో మాట్లాడు తాయి .
“మరో ఉదయం “ సంధ్య” ఈ కవితలు నిరాశ మనసుకు ఊరడింపు పలపకుతాయి .” వీరుడా వందనం “ మనసుతో మాటాడుతుంది . అన్ని కవితలు నిడివిలో చిన్నగా కనిపించినా అద్భుతమైన అంతర్గత భావాలతో అలరింప చేస్తాయి .ఇంక హిందీ కవితలు
“దో ముసాఫిర్ “ “రాస్తా”దేశాన్ని రక్షించే సిపాయిల గురించి ,”దిల్ “
ప్రేమకు దీర్ఘాయువు నిమ్మని భగవంతుని కోరుకుంటారు రాజ్ కృష్ణ .
అందరూ చదవ వలసిన ఒక మంచి కవితా సంపుటి .లోతైన భావాలతో తనదైన శైలి లో నడిచి పోయే మాటాడే ఒక మౌన గీతం .
ఇంకా ఎన్నో కవితలు వ్రాయాలని ..కవితా సంపుటాలు ముద్రించాలని జన రంజకంగా అందరి మన్ననలు పొందాలని శుభాకాంక్షలతో..చిన్నవాడు కాబట్టి
ఆశీర్వదిస్తూ ..
ఇట్లు
గజల్ రచయిత్రి

విజయ గోలి
“మౌనం మాట్లాడుతుంది”
రచయిత. రాజ్ కృష్ణ రేపల్లె
హిందీ ఉపాధ్యాయుడు
8555919959

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language