శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
మోమున నవ్వులు మెరిసిన భోగము కాదా
మనసున దివ్వెలు నిలిపిన యోగము కాదా
అహమున రేగితె మనిషికి విలువేముందిలె
ఈసును వీడితే …నిలవని రోగము కాదా
స్వార్ధం ఎపుడూ ఒప్పని తనమేగాదా
పుడమిన మెచ్చిన సంపద త్యాగము కాదా
మంచిని మించిన దైవము లేదను మాటే
ఇహమున కోరిక వదిలిన హోమము కాదా
స్పందన లేనిదె కవనము కదలగ లేదుగ
సాధన జరిగితె మార్గం సోమము కాదా!!