1)గజల్. విజయ గోలి
ఆగ మేఘ పరుగులేల ఆగి పోవె మేఘ మాల
పదిలంగా ప్రణయ లేఖ పంచి పోవె మేఘ మాల
జ్ఞాపకాల పరిమళాలు జావళీ గ రాసేనే
చిరునామా చిన్నదేలె చేర్చి పోవె మేఘ మాల
వాలుజడల వయ్యారం వాకిటనే నిలిచెననీ
పులకింతల పున్నమొచ్చె చెప్పి పోవె మేఘమాల
చిరు జల్లులు ఒలక పోసి తడవనీకె తలపు నిధి ని
ఇంద్రధనువు పల్లకీలొ ఇచ్చి పోవె మేఘమాల
చులకనగా చూడ బోకె చింతలలో ముంచబోకు
విరహ బాధ విభుని కడ విప్పి పోవె మేఘమాల