మేఘాలతో కబురంపా వేగిరమే రమ్మంటూ …
అంది ఉంటదనుకుంటా..
చిరుగాలితో పంపాను సంపెంగల పరిమళాలు ..
సందకాడే అంది ఉంటదనుకుంటా
మల్లెలతో చెప్పాలే మార్గమంతా నింపాలని …..
సెలయేరు కు చెప్పాలే స్వాగతాల స్వరాలే పాడమని ..
ఎదురు చూసే కన్నులకే చెప్పాలే కంటిపాప వెలుగులంపి
దారి చూపమంటూ…….విజయ గోలి
వలపు జల్లులు కురిపిస్తావని
వెన్నెల దారుల మల్లెలు పరిచి..
మంచి గంధము మనసు కు అలది
మధువుల నవ్వులు పెదవుల నింపి
మమతల వాకిలి తలుపులు తీసి..
అభిసారికనై నేనున్నా … విజయ గోలి
పరవశముగా నీ ఎద పై పవళించగా కోరితి…
తనివి తీరగ నీ లోన కరిగి పోవఁగ వేడితి..
రాగాలు నింపిన నీ అధరాల పై రస రాగాలె పాడగా నిలిచితి ..
తనువు ధనువు గ మలచి తాపమార్పగా వేచితి…Vijaya goli
నక్షత్రాలతో పోటీపడుతూ
నిశీధి నిండిన మిణుగురులు …
నిరంతరం నిజాన్ని ఓడించాలనే
అసత్యాల అధర్మ సంగ్రామం ..
తామరాకుపై నీహారిక నృత్యానికి
తొలికిరణపు స్పర్శల సన్మానం ..
మరుగున పడుతున్న బాంధవ్యాలకు
మమతల వంతెన అనివార్యం ..
.
వేసవి చేసిన గాయాలకు …
తొలకరి జల్లుల లేపనమే (ప్రకృతి )చికిత్స ….విజయ గోలి
అవని నుండి అంబరానికి వారధిగా ..
చిరుజల్లుల సంబరాల పెన్నిధిగా….Vijaya goli
అద్దానికి ఎంత అతిచతురతో…
తన ముందు నిలబడిన అందరికి ..
ఎదకు హత్తుకునేలా…చెప్తుంది…
ఒకే మాట..
నిన్ను మించిన వారెవరు…
నీకు సాటి లేరెవరు.. విజయ గోలి.
#Telugu Pride