మృత్యువు ని దర్శించిన మహనీయులెవరు ..😇
తమ అనుభవాన్ని చెప్పలేదు ఇంతవరకు ..🤫
అత్యంత అందమైనదేమో ,😊
అమ్మ లాంటి ఆదరణే ఉందేమో …😌
చేయి పట్టినాక విడువని స్నేహబంధమేనేమో ..😍😍
మరులు గొలుపు మత్తేదో వుంది మరి …🥰😘
స్వీయాన్ని మరిపించే చిత్రమే అది ..🤗
జతకట్టిన వారెవరూ తమ జాడనే తెలుప లేదు..🤔🤔
విజయ గోలి .🌹🌹
నీ అధరాలు తాకినందుకే కదా ..
వెదురుపుల్ల నిలిచింది వేణువుగా .
ఒక క్షణం నీ తలపు లో నను నిలపరాదా…
వసివాడని పూవై నీ పదముల నిలవగా ..విజయ గోలి
పగటి వెలుగులు పడమటి దిక్కుకు వలస పోతున్నాయి..
నీ నీడల్లే నేనున్నానంటూ అడుగులో అడుగేస్తూ..
అనుసరిస్తున్న నిశీధి .. vijaya goli
మహాత్ములుగా మిగలాలనే ఆరాటంలో ..
మానవత్వమే మరుస్తున్న మనుషులు ..vijaya goli
మతి చెప్పే మాటెపుడు మనసు వినదు
నిలువెత్తు నిజాలు నిలువుటద్దంలో నిలబడ్డా.. vijaya goli
మనసుకి వెకిలి మకిలి పట్టినపుడు..
స్నేహంలో నకిలీ రంగులు పుడుతుంటాయి ..vijaya goli