ముఖంపై ముసుగులు

రచన-:విజయ గోలి
ప్రక్రియ-:వచన కవిత

*ముఖంపై ముసుగులు*

ముఖాలపై ముసుగులు
ఇంద్రధనుస్సు రంగులలో
ఇరుకుమనసు లీలలు
నెమలీకల కాకులు
ఎరుపెక్కిన మనసుపైన
చిరునవ్వుల మేకప్పులు

అడుగడుగున నటనలతో
అయోమయపు బూటకం
ఆవుముఖపు నక్కలల్లే
వెన్నుతట్టి వెన్నరాస్తూ
వెనుకపోటు నైజము

చెహరాలపై పరదాలతో
నడుచుటెంత కష్టమోయి
మూడునాళ్ళ ముచ్చటోయి
చచ్చినాక బ్రతికినదే బ్రతుకంటె
కాకిలాగ కలకాలం నలుపెందుకు
తెలుపులోన తేలిపో హంసల్లే

ప్రేముంటే పొంగనీయి
కోపముంటె తరగనీయి
ఈర్ష్య లనే ఇగరనీయి
అలజడులను ఆర్పి వేయి
దాచుకుంటె దహియించును

అద్దమంటి మనసైతే
అందమంత నీదేగా
మనసుపైన ముసుగు తీస్తే
ముఖమంతా నవ్వులే !

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language