మహిళలు మహారాణులు విజయ గోలి
యత్ర నార్యస్తు పూజ్యన్తె రమంతే తత్ర దేవతాః
మహిళలంటేమహారాణులు
మగువలంటే అందమైన రంగవల్లులు
అతివలంటే మమతల పాలవెల్లులు
తల్లిగా,చెల్లిగా ,భార్యగా బిడ్డగా
పెనవేసిన బంధాలుఎన్నైనా
అసలు మాత్రం ముగ్గురమ్మల మూలరూపమే
కత్తి పట్టిన రుద్రమ్మలు
ఎత్తుకు పై ఎత్తులేసిన నాగమ్మలు
రచనలలో రాణించిన కమనీయ మొల్లలు
విశ్వ మాత గా వినుతి కెక్కిన థెరిస్సాలు
దేశాన్ని శాసించిన ఇందిరమ్మలు,
చందమామను ముద్దాడిన కల్పనలు
దేశ రక్షణలో రాటుదేలిన కిరణాలు
అస్త్రంలో ,శాస్త్రంలో ఆటలలో ,పాటలలో
ఇందు కలరు అందు లేరను సందేహము లేక
ఎందెందు వెతికి చూసిన అందందే కలరు
అద్భుతాలు సృష్టించిన ఆడవారు .
అష్టా దశ కళలందున ప్రతిభ చూపిన
వనితలందరికి అభినందన సుమాలు .
ముదితల్ నేర్వగా రాని విద్య కలదే ముద్దార నేర్పించాగాన్
ఆది కవుల నానుడికి అర్ధాన్ని చెప్తూ అన్నింటా
విజయ బావుటాలు వెలిగిస్తున్న అతివలందరికి
మహిళాదినోత్సవ శుభాకాంక్షలు!విజయ గోలి