రేపు మహాత్ముడి వర్ధంతి
భారత మాత అత్యుత్తమ పుత్రుడిని కోల్పోయిన రోజు
మనదేశం ఒక మహనీయుడిని కోల్పోయిన రోజు .
దేశం కోసమే పుట్టి దేశం కోసమే పెరిగి
జీవితాన్ని ఫణంగా పెట్టి
ఒక మతోన్మాది చేతిలో అసువులు బాసిన
భారత జాతిపిత మహర్షి మహా మనీషి మహాత్మా గాంధీజీ
వర్ధంతి సందర్భంగా నివాళు లర్పిస్తూ ..నా ఈ చిరు కవిత
నిజానికి అహింస అనే ఆయుధానికి బదులు మరొక ఆయుధం రావొచ్చేమో
స్వాతంత్ర్య ఉద్యమంలో సంపూర్ణ భారత జాతిని ఒక్క త్రాటి పై నడిపిన
మహాత్ముని మించిన మహా నాయకుడు మాత్రం మరి రాడు .
నీవొక్కడివే ….
ఓ మహర్షీ..
సత్యాన్నే శస్త్రంగా
అహింస యే అస్త్రంగా
చెరగని బోసినవ్వుతో
బక్క దేహాన ఉక్కు గుండెతో
భారతావని బంధ విముక్తి కై
చేతికర్ర ఊతమిచ్చిన
ఉప్పు ఉద్యమ కారీ ..
ఓ బాపూజీ
అణువు అణువున
స్ఫూర్తి నింపుతూ
అడుగు అడుగున
ఆత్మ బలమే నీవుగా
తెల్ల వారి గుండెలపై
అహింస బల్లెమే గుచ్చావు
సమర శంఖునినాదమే నీవై
సాధించావు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని
ఓ మహాత్మా..
చెడు వినకు. చెడు అనకు
చెడు కనకు సూక్తిగా
భాయి భాయంటూ
బంధాలు కలిపి
శత్రువును ప్రేమించమన్నావు.
శాంతి సమరాన సమిధ వయ్యావు
జాతిపితగా జగతి నిలిచావు .
ఓ మహాత్మా …నీ అడుగుజాడలే ..
మాకు అనుసరణీయం …
ఓ మహర్షీ నీ వ్యక్తిత్వమే మాకు స్ఫూర్తి …
అప్పటికి ..ఇప్పటికి …ఎప్పటికీ…
అవని ..ఆకాశాలున్నంతవరకు ..
.భారత జాతిపిత .. నీవే..నీవొక్కడివే…
నీ వొక్కడివే. నీ ఒక్కడివే నీ ఒక్కడివే 🙏🏻🙏🏻