గజల్ విజయ గోలి
మల్లెలార మౌనమేల పిలిచినాడు మాధవుడే
జాజులార జాగేలా. తలచినాడు మాధవుడే
మధుమాలతి శయ్యపైన మందారపు అరుణిమలే
విరజాజులు శిగపాయల తురిమినాడు మాధవుడే
సంపెంగల సమీరమే పల్లవిగా పాడినదే
కలికితనమె చరణాలుగ కోరినాడు మాధవుడే
రెల్లుపూల రేకులపై తారాడిన వెన్నెలమ్మ
వలపుమీర వొడినచేరి వొదిగినాడు మాధవుడే
మురళిరవళి అధరాలపై నవ్వినదే విజయమనీ
నడిఝామున మబ్బుగానె కమ్మినాడు మాధవుడే