రచన -: విజయ గోలి
గజల్
మల్లెపూల మత్తుజల్లి మరలిపోతె ఏలాగా
తాళలేని తపనముంచి తరలిపోతె ఏలాగా
మంచెకాడ ముచ్చటాడి మళ్ళీమళ్ళీ రమ్మంటివి
సందెకాడ సద్దుచేసి పారిపోతె ఏలాగా
షావుకారి ఇంటికాడ సైగచేసి పిలిచావే
సరసమాడ చేయిపట్ట జారిపోతె ఏలాగా
మాఘమాసం మాపటేల మనువంటివి
ఆగనంటె అందాకా అలిగిపోతె ఏలాగా
వింటాలే నీమాటలె విజయమిచ్చు దారేగా
నలుగురిలో నవ్వులుగా పరువుపోతె ఏలాగా