మరణానికి కరుణ లేదు విజయ గోలి
మరణానికి కరుణ లేదు..
కఠినమైన శాసనాలు చేస్తుంది..
మనసు సూన్యమైపోయింది ..
మనుగడ మసకబారి పోతుంది..
సహా జీవనానికి వీడ్కోలు …
అనుభవాలన్నీ మనసు అద్దంలో ప్రతిబింబిస్తుంటే …
పొలమారుతున్న నవ్వులతో …
ఎంత బాగా నటిస్తున్నాము …
ఆటు పోట్లన్నీ…ఆడుతూ పాడుతూ..
పంచుకున్నాము ..ఒకరికొకరం తోడుగా …
కనుల ముందు కదులుతున్న ..
చెలిమి…అదేగా .. కలిమి …
.
చివరి ఘడియ వరకు…చేతిలో చెయ్యేసి …
చెలిమి నవ్వులు పంచుకుంటూనే ఉందాము..