శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
మనిషి తనం తెలుసుకోని మనిషేలా పుడమిపైన
ప్రేమ మధువు పంచ లేని మనసేలా పుడమిపైన
మానుకైన పలకరింపు పులకరించు చిగురులేసి
చెంతచేరి లాలించని చెలిమేలా పుడమిపైన
పంచుకున్న కరిగిపోవు పరితాపం హిమసుమమై
ఉలుకు లేని శిలలాగా ఉనికేలా పుడమిపైన
ఎదలోపలి నమ్మకంతొ ఎదురుచూపు ఓర్చుతుంది
వమ్ముచేసి వలసపోవు బ్రతుకేల పుడమిపైన
కాలమంత తిరిగి తిరిగి కలిసేనులె ఒకచోటనె
మరల మరల జన్మలతో మాయలేల పుడమిపైన!!