మనవి

శుభోదయం 🌹🌹🌹🌹🌹

*మనవి . విజయ గోలి

ఇప్పుడే నేను రెక్కలు కదపటం మొదలు పెట్టాను .
అప్పుడే నా రెక్కలు నరుకుతున్నారు ..ఏమిటి నా తప్పు ?

సృష్టిలో నల్లంచి పిట్ట కూడా ..
నాలుగు దిక్కులా ఎగురుతుంది .
గెలుపు ఓటముల సమరం కాదే …నాజీవితం
నా కలలకు వారధి కట్టుకుంటున్నాను .
నిర్దాక్షిణ్యంగా కూలదోస్తున్నారు ఎందుకు ?

నింగి నేలా నీకూ నాకూ సమానమే కదా..
హద్దులు గీసి ఆంక్ష లెందుకు ?
ఆధిపత్యం కోసం ఆరాటం కాదు …
శ్వాసించే హక్కు సమానమంటున్నాను.
అలసత్వపు నెపంతో అవమానించొద్దని వినతి !

మాతృత్వానికి , మానవతకు మన్నన ఇవ్వమన్నాను !
సహనాన్ని సమరానికి నడపొద్దని మనవి చేస్తున్నాను !

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language