శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
మట్టి పూల పరిమళాల మలుపన్నది లేదులే
మనిషి కెపుడు మరణంపై గెలుపన్నది లేదులే
వ్యధ కెపుడు వేధించే అలవాటై వెంటాడు
సహనమున్న జీవంటే హద్దన్నది లేదులే
నేటి మనసు ప్రతి ఏమో ఎదుటకొచ్చి నిలిచింది
చిన్ననాటి చిత్తరువున రంగన్నది లేదులే
మరుపులేక గాయమెపుడు మౌనంలో మౌనిలా
కనులు చెప్పని కధకెపుడు పలుకన్నది లేదులే
స్మృతులు లేని బ్రతుకంటే మృత్యువుతో ముచ్చటే
శ్వాసలతో నడిచినా విజయమన్నది లేదులే!!