*మకరందపు జల్లు విజయ గోలి
అగాధాల అంచుల పైన
ఆలుమగల అభిజాత్యం
వేళ్ళూనిన అతి స్వార్ధం
మాయమైన మంత్రబలం
విలువలేని వింతబంధం
అదుపులేని ఆధునికం
ఆర్ధికమే అన్నింటా ఆద్యం
తూనికే తెలియని కొలమానం
నీది..నాది..మధ్య..
నిర్విరామ యుద్ధం ..
మనసు మధ్య దిగబడిన
గాజు తెరల బంధంతొ
మనం మసకబారిపోయింది
కడదాక తెలియదు
కాలంలో కరిగినది
కనులు తెరుచు నాటికి
కలలేమి మిగలవు..
సంసారపు సాగరంలో
లోతుతెలిసి ఈత కొడితే
దొరికేను ముత్యమంటి
ఎదురులేని విజయాలు
ఆలుమగల బంధంలో
అందమెంతొ చదివితే
జీవితాన ఆగిపోని..
మకరందపు జల్లులే