*బేపారి విజయ గోలి
బాటసారిగా వచ్చావు బేపారిగా మారావు.
విభజించి పాలించి విజేతవయ్యావు ..
కలుపుమొక్కే కదా పీకేస్తే పోతుందన్నాము
.మంచితనాన్ని చేతకానితనమన్నావు
మా అవధులు దాటిన ఆగ్రహాన్ని ..
అహింస అనే అగ్నిపర్వతపు లావా ని ..
తట్టుకోలేక తట్ట సర్దుకొని గట్టు దాటావు..
మా తరాల సంపద తరలించుకు వెళ్లావు…సహించాము ..
వెల కట్టలేని మా సంస్కృతిని వెంట తీసుకెళ్ళావు ..
బంగారు బాట నెక్కావు బాగుపడతావనుకున్నాము ..
స్వాతంత్ర్యపు సంబరాల సడి తగ్గకముందే తెలిసింది ..
నువ్వు మాకు చేసిన తరతరాలకు తీరని ద్రోహం …
నువ్వు వెదజల్లిన కలుపు గింజలు ..మొలకెత్తి ..
మహావృక్షాలై …విషపు గాలులు విరజిమ్ముతున్నాయి …
మా వేదసంస్కృతికి నిట్టనిలువునా నిప్పుపెడుతున్నాయి.
నీపాపానికి సమాధానం మా నమ్మకమే చెప్తుంది