చిన్నారి బుజ్జికి ..
పుట్టిన రోజు శుభాకాంక్షలతో …
ఆకాశాన్ని అడిగాను హరివిల్లిమ్మని…
ఆమని హంగుల పొదరిల్లిచ్చింది
కార్తీక పున్నమి చందమామని
కొసరు కాంతుల కొలువుగ పంపింది
ఆటల పాటల అల్లరి విల్లైనా…
బాధ్యత లెరిగిన బాంధవి తాను !
అమ్మా నాన్నల అనురాగం
అడుగు అడుగునా గడుసుదనం
అక్క తోటి అనుబంధం
అందమైన ఆ బాల్యం ..
మేధ లోన మేటితనం
అన్నిటి లోన ప్రత్యేకం
అందరి సరసన ఆకతాయి … బుజ్జి
మెట్టింటన మెప్పుల పంట
నట్టింటన ఒప్పుల జంట
కడుపున పండిన ఆ పంట
ఆ కన్నుల వెలుగంట
నలుగురు కలిసిన ఆ ఇంట
ఆగనిదే నవ్వుల పంట
లెక్క లేక పుట్టిన రోజులు
రెక్కలు తొడిగి ఎగరాలి
ఆరోగ్యం ఆనందం అహర్నిశం
కుడి ఎడమల కుదురుగ నిలవాలి
మెచ్చిన దైవం కనుల నిండుగా
కళ కళ లాడగ కరుణనే పంచాలి
ఎల్ల వేళలా కంటికి రెప్పలా కాచాలి !!
ఏభై అయినా వందైనా ..
నా కెప్పటికీ పుట్టిన రోజున బుజ్జివే ..
ఎపుడూ లలితమ్మ దయ నీపై ఉండాలని ..
అనుకున్న కోరికలన్నీ తీరాలని
ఆరోగ్యం ,ఐశ్వర్యం ,మంచితనం ,మానవత్వం
మార్గదర్శకంగా వుండాలని కోరుకుంటూ ..
అంతు లేని ఆశీస్సులతో శుభాకాంక్షలు !!
ప్రేమతో
అమ్మ 💕💕
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕