భారత రాజ్యాంగ రచన శిల్పి …మహనీయ మానవతావాది…
భారతరత్న శ్రీ బాబా సాహెబ్ భీం రావు అంబేద్కర్ జయంతి సందర్భంగా …
చిరు నివాళి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹💐🌹💐🌹🌹🌹🌹🌹💐💐💐💐
*బాబా సాహెబ్. విజయ గోలి
భాగ్య భారతి
మణి మకుటమున
మెరయు జాతిరత్నం
మారాట దేశాన పుట్టిన
మహనీయ భారత రత్నం
బాబా సాహెబ్ అంబేద్కర్
ఆదినుండి అగ్రవర్ణాల
అహంకారమే అస్పృశ్యత
జాతి వర్ణాల జాడ్యం
కుల మతాల కుళ్ళు రోగం
సమాజ వేరు ముట్టిన
చావు లేని చెద పురుగు..
అగ్రమతాల అహంకార
పీడనల దర్పణమే అతడు
అంటరాని తనముపై
వింటి నారిని సారించిన
సవ్యసాచి ..మానవీయ శక్తి
దేశ దేశాలు చుట్టి
అభ్యుదయమును
ఔపోసన పట్టిన ..
భారత రాజ్యాంగ రచన కర్త
విజ్ఞాన గని .. సంఘ సంస్కర్త
అడుగు అడుగున
బడుగు జనులకు
ఊతమిచ్చి ఉనికి నిచ్చి
నీడనిచ్చిన గొడుగు అతనే
అంటరాని తనమును
వెంటబడి తరిమిన
ఉద్యమ నేత..అహింసా వాది
జాతికి జాగృతి నిచ్చిన నేతకు
జన్మదిన జయ వందనం. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻