విరపూసిన మందారం లో..
నీ దివ్య సుందర రూపమే…
కనువిందు చేస్తుంది….
నవ్వుతున్న నందివర్ధనాలలో ..
నీ దరహాసం హంసధ్వని లో..
వీనుల విందు చేస్తుంది …
తడిసిన పారిజాతాలపై …
నీ అడుగుల సవ్వడి లో …
నా ఎద చప్పుడు..లయ తప్పుతోంది …
వెదురు గుబురుల ఈల ..
నీ వేణువు చేరి వలపు రాగాలతో …
మదిని మైమరపు శయ్యపై ..
వూయలూపుతోంది …
మూసిన నా కన్నుల…
నీ విశ్వ మోహన రూపం..
తీయని కలల తో చెలిమి ……
అలుపు ఎరుగని ఎదురు చూపులకు ..
వేకువొచ్చేనా విరుల బాటలేసేనా …విజయ గోలి ..