విజయ గోలి
జో జోల పాపాయి జోరుగా పెరగాలి జో..జో
అమ్మలందరు నీకు ఆదర్శమవ్వాలి …
అన్నింట నీవే ఆణిముత్యముగా మెరవాలి ..
.జో జోల పాపాయి జోరుగా పెరగాలి..జో ..జో
ఆడపిల్లవు నీవనుచు హద్దులెడతారు..
హద్దులను దాటేసి హక్కులడగాలి..
జో జోల పాపాయి జోరుగా పెరగాలి..జో ..జో
ఎవరెస్టు పైకెగుర వెరవకుండాలి …
చందమామను ముద్దాడ ముందుకెళ్లాలి ..
విశ్వమంతా నీ కీర్తి వెల్లువెత్తాలి .
..దేశమాతకు నీ పేర హారతివ్వాలి
.జోజో ల పాపాయి జోరుగా పెరగాలి..జో ..జో..